మన తెలుగు భాషకు తమ రచనలతో అపర ఖ్యాతి సంపాదించిన ఘనత కచ్చితంగా కవులదే. వారిలో చెప్పుకోదగిన వారు కవిత్రయంగా పిలువబడుతున్న నన్నయ్య, తిక్కన, ఎర్రాప్రెగడ. వారిలో ప్రథముడు నన్నయ్య.





11 వ శతాబ్దానికి చెందిన వాడుగా భావిస్తున్న నన్నయ్య  తెలుగులో మహా భారతాన్ని తర్జుమా చేసేందుకు శ్రీకారం చుట్టారు. అంతకు ముందు తెలుగులో రాసిన గ్రంథాలు చిక్కకపోవతంతో మహాబారతాన్నే ఆది కావ్యంగా భావిస్తూ దానిని రాసేందుకు శ్రీకారం చుట్టిన నన్నయ్యను ఆది కవిగా ప్రస్తుతిస్తున్నారు. రాజమహేంద్ర వరాన్ని పరిపాలించిన రాజరాజ నరేంద్ర మహారాజు విన్నపం మేరకు మహాభారతం ఆంద్రీకరించెను. నన్నయ్యకు వాజ్మయ దురంధుడు, అష్ట భాషా కోవిదుడైన నారాయణ భట్టు సహకరించెను. వ్యాసభారతాన్ని తెలుగులోకి అనువదించిన నన్నయ్య దానిని యథామూలానువాదం చెయ్యలేదు. స్వేచ్ఛానువాదాన్ని ప్రారంభించాడు. 18 పర్వాల మహాభారతంలోని తొలి రెండు పర్వాలైన ఆది పర్వం, సభా పర్వం పూర్తి చేసి మూడో పర్వమైన అరణ్య పర్వం సగం వరకు రాసి పరమపదించారు. నన్నయ్య పుట్టుక, తల్లి తండ్రులు, ఇంటి పేరు గురించిన సరైన ఆధారాలు లభించలేదు. ఇంటిపేరు వాడ్రేవు వారని చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రి గారి వాదన. నన్నయ్యను నన్నయ భట్టు అని కూడా అంటారు. రాజరాజ నరేంద్రుడు రాజ మహేంద్ర వరాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించిన కాలంలో నన్నయ అతని ఆస్థాన కవిగా ఉండేవాడు. నన్నయ్యకు ఆదికవి, వాగమ శాసనుడు అనే బిరుదులున్నాయి. నన్నయ్య ఆంధ్ర మహాభారతమే కాకుండా చాముందిక విలాసం,ఇంద్ర విజయం అనే కావ్యాలు, ఆంద్ర శబ్ద చింతామణి అనే సంస్కృత వ్యాకరణ గ్రంధాన్ని రచించాడని చెప్తారు. ఆంధ్ర శబ్ద చింతామణి తెలుగు భాష గురించి రాసినదైనా ఎవరు రాసారన్నది వివాదాస్పదం. మిగిలిన రెండు కావ్యాలు నన్నయ్యవే అనడానికి ఎలాంటి ఆధారాలు లేవు.





కవిత్రంలోని రెండోవాడు తిక్కన. క్రీ.శ.1205-1288 కాలానికి చెందిన ఆయన మహాభారతంలో నన్నయ రచించిన ఆది పర్వం, సభా పర్వంతో పాటు అరణ్య పర్వాన్ని మినహాయించి 15 పర్వాలను రచించాడు. అరణ్య పర్వము రాస్తూ పాండవుల కష్టాలను వర్ణిస్తూ నన్నయకు పిచ్చి పట్టిందని,అందుకే నన్నయ వదిలిపెట్టిన అరణ్య పర్వం శేష భాగాన్ని తిక్కన పూరించలేదనే వాదన ఉంది.ముందుగా యజ్ఞము చేసి, సోమయాజియైన తర్వాత మహాభారత అనువాదాన్ని మొదలుపెట్టడంతో తిక్కనకు సోమయాజీ అనే బిరుదు కూడా ఉంది. ఈయనకు "కవి బ్రహ్మ", "ఉభయ కవిమిత్రుడు" అనే బిరుదులు కూడా ఉన్నాయి. శివకేశవుల అభేదమును తెల్పు హరిహరనాధుని స్తుతితో తిక్కన భారతాన్ని ప్రారంభించాడు.తన కాలం నాడు సంఘములోని మతవైషమ్యాలను గమనించి శైవ వైష్ణవ మత కలహాలకు అతీతంగా హరిహరాద్వైతాన్ని సృష్టింఛాడు. సంఘసంస్కర్తగా నిలిఛాడు. అలతి అలతి పదముల అనల్పార్థ రచన కావించిన మహాకవి తిక్కన. తాను రచించిన 15 పర్వాల భారతాన్ని ప్రబంధమండలిగా పేర్కొని, నాటకీయ శైలిలో నానారసాభ్యుదయోల్లాసిగా రచించాడు. కవిత్రయములో నన్నయది కథాకథన శైలి. ఆఖ్యాయిక శైలి. తిక్కనది నాటకీయ శైలి, సంభాషణాత్మక శైలి.


క్రీస్తు శకం 1253 సంవత్సరంలో తిక్కన కోవూరు మండల పరిధిలోని పాటూరు గ్రామ సిద్దేశ్వరాలయంలో యజ్ఞం చేసినట్లు చరిత్ర చెబుతోంది. తిక్కన పూర్వీకులు 'కొట్టురువు' ఇంటి పేరుతో పాటూరు గ్రామాధిపతులుగా పనిచేసినట్లు చరిత్ర చెబుతోంది. మనుమసిద్ధి కాలంలో తిక్కన ఇంటిపేరు 'పాటూరుగా' మారినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. యజ్ఞయాగాదులు అంటే తిక్కనకు చాలా ఇష్టం. పదకొండు పర్యాయాలు ఆయన పాటూరులోని సిద్ధేశ్వరాలయంలో యజ్ఞం చేసినట్లుగా కేతన తన దశకుమార చరిత్రలో పేర్కొన్నారు. మహాభారత రచనకు తిక్కన ఉపయోగించిన 'ఘంటం' పాటూరుకు చెందిన తిక్కన వారసుల వద్ద ఉందని చెబుతారు. 'ఘంటం' ఉంచే ఒరకు ఒక వైపు సరస్వతీ దేవి, వినాయకుని ప్రతిమల్ని చెక్కారని, తాము చాలా సంవత్సరాల క్రిందట దానిని చూశామని పాటూరు గ్రామ వయోవృద్ధులు చెప్పారు. నెల్లూరుకు చెందిన సాహిత్య సంస్థ 'వర్ధమానసమాజం' కొన్నేళ్ల కిందట నిర్వహించిన 'తిక్కన తిరునాళ్ళ'లో దానిని ప్రదర్శించారు. ఆ తరువాత ఒర చిరునామా లేకుండా పోయింది. తిక్కన రూపాన్ని దశకుమార చరిత్రలో కేతన వర్ణించారు. ఆయన వర్ణన ఆధారంగా 1924 సంవత్సరంలో గుర్రం మల్లయ్య అనే చిత్రకారుడు ఆంధ్రా యూనివర్సిటీ నిర్వహించిన చిత్రలేఖన పోటీల్లో తిక్కన రూపాన్ని చిత్రీకరించారు. ఆ చిత్రపటమే నేడు నెల్లూరు పురమందిరంలోని వర్ధమాన సమాజంలో పూజలందుకుంటోంది. 1986 సంవత్సరంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఆలయ పునర్నిర్మాణానికి రెండు లక్షల రూపాయల్ని మంజూరు చేసింది. హైదరాబాదులోని టాంకు బండ్‌పై తిక్కన విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టించింది.


తిక్కన రుద్రాక్షమాల లభ్యం

12వ శతాబ్దంలో తిక్కన ఉపయోగించినట్టు భావిస్తున్న రుద్రాక్షమాల వెలుగుచూసింది. నెల్లూరులో నివశిస్తున్న ఆయన వంశాస్తురాలు లక్ష్మి ప్రసన్నకు ఆ మాల వంశపారంపర్యంగా సంక్రమించింది.


ఎఱ్ఱన



ఎఱ్ఱా ప్రగడ 14వ శతాబ్దములో రెడ్డి వంశమును స్థాపించిన ప్రోలయ వేమారెడ్డి ఆస్థానములో ఆస్థాన కవిగా ఉండేవాడు.ఎఱ్ఱా ప్రగడను ఎల్లాప్రగడ,ఎఱ్ఱన అనే పేర్లతో కూడ వ్యవహరిస్తారు. ఈయనకు "ప్రబంధ పరమేశ్వరుడు" అని బిరుదు కలదు. మహాభారతంలో నన్నయ అసంపూర్ణముగా వదిలిన అరణ్య పర్వాన్ని ఎఱ్ఱన పూర్తి చేసినాడు. పాకనాడు సీమ (ప్రస్తుత ప్రకాశం జిల్లాలోని భాగము)లోని ఎఱ్ఱన గుడ్లూరు గ్రామములో జన్మించాడు. ఈయన ప్రస్తుత గుంటూరు జిల్లా వేమూరు మండలములోని చదలవాడ గ్రామములో నివసించినాడు. ఆయన శ్రీవత్స" గోత్రము "అపస్తంబు" శాఖకు చెందిన బాహ్మణుడు. అతని తండ్రి సుర్రన్న, తల్లి పొత్తమ్మ. ఎఱ్రన్నకు అతని తాత గారి నామధేయమయిన ఎఱ్రపొతన నామకరణం చేశారు అతని తల్లిదండ్రులు. ఎఱ్ఱాప్రగడ మామ్మ పేరు పేర్రమ్మ. ఎఱ్ఱాప్రగడ ముత్తాత ల పేర్లు బొలన మరియి పొలమ్మ. ఎఱ్ఱాప్రగడ కుటుంబ ఆరాధ్య దైవం శివుడైనా విష్ణువుని కూడా పూజించేవారు.గురువు గారి పేరు శ్రీశంకర స్వామి.ఎఱ్ఱన హరివంశము, రామాయణాన్ని సంస్కృతం నుండి అనువదించి ప్రోలయ వేమారెడ్డికి అంకితమిచ్చాడు. నృసింహ పురాణము అనేది ఎఱ్ఱన స్వతంత్ర రచన. పురాణం ప్రకారం ఒకరోజు ఎర్రన ధ్యానంలో మునిగి ఉండగా అతని తాత కనబడి ఈ రచనను చేయమని సలహా ఇచ్చాడు. ఇది బ్రహ్మాండపురాణంలోని కధ, విష్ణు పురాణం ఆధారంగా వ్రాయబడింది.

No comments:

Post a Comment