భాషపురాతత్త్వ పరిశోధనల ప్రకారము తెలుగు భాష 2400 సంవత్సరాల ప్రాచీనమైనది.
క్రీస్తు శకం మొదటి శతాబ్దంలో శాతవాహన రాజులు సృష్టించిన "గాధాసప్తశతి" అన్న మహారాష్ట్రీ ప్రాకృత పద్య సంకలనంలో తెలుగు పదాలు మొట్టమొదట కనిపించాయి. అలాగే లభించిన తొలి ప్రాచీన శిలాశాసనం 7 వ శతాబ్దానికి చెందినది. శాసనాల్లో లభించిన తొలి తెలుగు పదం 'నాగబు'. 11 వ శతాబ్దములో నన్నయ భట్టారకుడు రచించిన 'భారతం' తొలి తెలుగు గ్రంథంగా పేర్కొనవచ్చు. ఆ కాలంలోనే తెలుగు రూపాంతరముగా "తెనుగు" అనే పదము ఉంది.  అయితే ఆ రెండు వేర్వేరు భాషలనే వివాదం ఉంది. క్రీ.పూ.700 ప్రాంతంలోని ఐతరేయ బ్రాహ్మణము (ఋగ్వేదం)లో "ఆంధ్ర" అనే పదం జాతి పరంగా వాడారు. బౌద్ధ శాసనాలు, అశోకుని శాసనాలలోనూ ఆంధ్రుల ప్రస్తావన ఉంది. తెలుగు భాష వ్యవహారంలో ఉన్న ప్రాంతాన్ని ఆంధ్ర రాజులు పరిపాలించడం వల్ల ఆంధ్ర, తెలుగు అన్న పదాలు సమానార్థాలుగా మారాయని ఓ వాదన ఉంది. 10 వ శతాబ్దానికి చెందిన పారశీక చరిత్రకారుడు ఆల్ బిరుని తెలుగు భాషని 'ఆంద్రీ' అని రాశాడు. శ్రీశైలం, కాళేశ్వరం, ద్రాక్షారామం, అనే మూడు శివలింగక్షేత్రాల మధ్య భాగము త్రిలింగదేశమనీ, "త్రిలింగ" పదము "తెలుగు" గా రూపాంతరం చెందిందని ఓ వాదన ఉంది. ఇలా తెలుగు, తెనుగు, ఆంధ్ర - అనే పదాలు భాషకూ, జాతికీ పర్యాయ పదాలుగా రూపు దిద్దుకొన్నాయి.

లిపి

తెలుగు లిపి ఇతర భారతీయ భాషా లిపులలాగే ప్రాచీన బ్రాహ్మీ లిపి నుంచి ఉద్భవించింది. అశోకుని కాలంలో మౌర్య సామ్రాజ్యానికి సామంతులుగా ఉన్న శాతవాహనులు బ్రాహ్మీ లిపిని దక్షిణ భారతదేశానికి తీసుకొని వచ్చారు. దీంతో దక్షిణ భారత భాషలు మూలం ద్రావిడ భాష అయినా వాటి లిపులు మాత్రం బ్రాహ్మీ నుంచి పుట్టాయి. అంకెలను గుర్తించడానికి తెలుగులో ప్రత్యేకంగా సంకేతాలున్నా అరాబిక్ అంకెలే సర్వసాధారణంగా ఉపయోగింపబడుతున్నాయి. ఈ విధంగా, తెలుగులో, 16 అచ్చులు, 3 విశేషఅచ్చులు, 41 హల్లులు చేరి మొత్తం 60 సంకేతాలు కలవు.

వాజ్మయము

తెలుగు భాషా సాహిత్యంపై సంస్కృత ప్రభావము ఎక్కువగా ఉంది. దైనందిన జీవితంలో మనం ఉపయోగిస్తున్న అమ్మ, నాన్న, అన్నం తదితర పదాలు సంస్కృత పదాలే. అలాగే పర్షియన్లు, అరబుల పరిపాలన కారణంగా ఆ భాష పదాలు కూడా తెలుగు భాషలో చేరిపోయాయి. తెలుగు పదాలు  అచ్చుతో అంతమయ్యే విధంగా ఉండటంతో ఇది సంగీతపరంగా సంగీత కళాకారులకు చాలా ఇష్టమైన భాష. కర్ణాటక సంగీతంలోని చాలా కృతులు తెలుగు భాషలోనే ఉండటానికి ముఖ్యకారణం ఇదే. పందొమ్మిదవ శతాబ్దానికి చెందిన యూరోపియనులు తెలుగును "ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్" అని పిలుచుకున్నారు.

No comments:

Post a Comment